Saturday, February 25, 2017

Master study

since it is cold and grey most of the time here in Berlin and most of the time too cold for me to go out and paint, I decided to start doing master studies. Here is my abomination of Robert Henri's painting  'Dutch girl in white' from 1907


బెర్లిన్ చలి భరించలేని చలి.. మరి హైదరాబాదు నుంచి వచ్చినోడికి చలేయ్యక  వేడిగా ఉంటుందా, వెటకారం కాకపోతే!  సర్లే ఈ చలి లో  బయటకి ఎం బొమ్మలు వేస్తాను,అందుకే ఎంచక్కా ఇంట్లో కూచుని హీటర్ వేడిలో  మాస్టర్ స్టడీ చేద్దామని, ఈ వికారమైన painting స్టడీ చేశాను, అసలు పెయింటింగ్  కింద ఉంది, రాబర్ట్ హెన్రి అని ఒక మహానుభావుడు 1907లో వేసాడు. 


 The original  painting from Rober Henri

Tuesday, February 7, 2017

FIlm Study - Planet Earth 2

ఫిల్మ్ స్టడీ గురించి చాలా మంది ఆర్టిస్టులు  చెప్పగా విన్నాను. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనుకున్నాను, ఒక బ్రహ్మాండమైన  నేచర్  డాక్యుమెంటరీ - ప్లానెట్ ఎర్త్ 2 చూస్తునప్పుడు కిక్కు వచ్చింది. అందులో  2వ భాగంలో మంచు పర్వతాలలో నివసించే  గోల్డెన్ ఈగల్ ( డేగ) గురించి ఎన్నడు చూడని విధంగా చిత్రించారు. అధ్బుతం అనుకోండి,  తప్పకుండా చూడండి.
ఆ భాగం లో ఒక ఫ్రేమ్.

I read posts by many artists about the advantages of film studies. I wanted to try that too, and felt a little tickle for that while watching the phenomenal series Planet Earth 2.  This is a frame from 2nd episode about Mountains.  





Monday, February 6, 2017

మొదటి టపా - First Post

 ఎప్పటినుంచో అనుకుంటున్నా ఒక బ్లాగు మొదలుపెడితే  బాగుంటుంది అని. ఇన్నాళ్ళకి  ధైర్యం  వచ్చింది. ఈ బ్లాగు నా బొమ్మలకి, నేను ఈ ఆర్ట్ ప్రపంచంలో   చూసే , నేర్చుకునే  విషయాలకి ఒక వేదికగా నిలుస్తుంది అని అనుకుంటున్నాను. ముందుగా మీ కోసం నేను  మొన్న శనివారం గీసిన ఈ పెయింటింగ్. క్రిస్మస్ సెలవుల్లో  ఈ బోన్సాయ్ మొక్క కొన్నాను, దీని పేరు జర్మన్లో  "గ్లుక్స్ బవుము", ఆంటే  ఆనంద వృక్షం. 


I have been thinking for a while to start a blog, finally found courage for it. I hope this blog remains as a place to post and look at my journey about everything i see and learn. To begin with I will start with a painting I did this saturday. Its a bonsai I bought around christmas holidays, Its called 'Glücksbaum' , a happiness tree.